వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో చిరుకు ప్రత్యర్ధులెవరు?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేయడంతో ఒక్క సారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. చిరంజీవే తిరుపతి అభ్యర్థి అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీల నుంచి ఎవరు అభ్యర్థులు అవుతారన్న అంచనాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో సినీగ్లామర్‌ ఉన్న వారినే రంగంలోకి దించుతారా, లేక ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తులను బరిలోకి దించుతారా అనే విషయంపై సర్వత్రా చర్చ మొదలయింది.

కాంగ్రెస్‌కు చెందిన ఒక వర్గం చెబుతున్న సమాచారం ప్రకారం చిరంజీవికి పోటీగా సినీనటుడు, తాజాగా ముఖ్యమంత్రికి వియ్యంకుడు అయిన మోహన్‌బాబును రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. మోహన్‌బాబు స్థానికంగా జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో పాటు ప్రముఖ సినీ నటుడు కావడం, ముఖ్యమంత్రికి వియ్యకుండు కావడం తదితర కారణాల దృష్ట్యా మోహన్‌ బాబును చిరంజీవికి పోటీగా బరిలోకిదించే సూచనలున్నాయని అంటున్నారు. తిరుపతిలో చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువ. ఈ ఓటు బ్యాంకును చీల్చడానికి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయిన డీకే ఆదికేశవులును బరిలోకి దించే అవకాశం వుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.

చిరంజీవికి పోటీగా కొత్త వారిని బరిలోకి దించుతుందా, లేక ఇప్పటికే అభ్యర్థులుగా ప్రచారమైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిలనే అభ్యర్థులను చేస్తుందా వేచి చూడాల్సిందే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ముందుగా అనుకున్నట్లు శంకర్‌రెడ్డి అభ్యర్థిగా వుంటారా లేక సినీగ్లామర్‌తో పాటు ఘాటుగా మాట్లాడే సత్తాకలిగిన తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజాను అభ్యర్థిని చేస్తారా అనే విషయంపై చర్చ సాగుతోంది. అయితే రోజా చంద్రగిరి టిక్కెట్టుపై ఆశలు పెట్టుకుని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తిరుపతి నుంచి బరిలోకి దిగాలని వుందని చిరంజీవి చేసిన ప్రకటనతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంలో ఇలా గందరగోళం నెలకొని వుండగా జిల్లా ప్రజారాజ్యం శిబిరంలో మాత్రం ఉత్సాహం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X