విషమంగా వాజ్‌పేయి ఆరోగ్యం

Atal Bihari Vajpayee
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఎయిమ్స్ వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనకు శుక్రవారం వెంటిలేటర్ అమర్చినట్టు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ విషయమై ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ మాట్లాడుతూ వాజ్‌పేయి శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నా ఆయన రక్తపోటు, కాలేయం, మూత్రపిండాల పనితీరు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల రీత్యా 84ఏళ్ల వాజ్‌పేయిని ఐసీయూలో కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వాజ్‌పేయి గత కొంతకాలంగా ఆరోగ్య సంబంధ సమస్యలతో బాధ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+