పోటీకి మున్నాభాయ్ అనర్హుడు: సుప్రీం

Sanjay Dutt
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌కు చుక్కెదురైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంజయ్ దత్ ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌, జస్టిస్‌ సదాశివం ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది.

అక్రమంగా ఆయుధాలను కలిగిఉన్న కేసులో టాడాకోర్టు ఆయనకు ఆరేళ్లు జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. ఆయనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోరింది. సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు పోటీకి అనుమతి నిరాకరించడంతో ఆయన భార్య మాన్యత పోటీకి దిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+