సిపిఎంతో సిపిఐ మిత్రభేదం
గుంటూరు: మహాకూటమిని విచ్ఛిన్నం చేయడానికి సిపిఎం కుట్రలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. మంగళగిరిలో తాము పోటీ చేయడం తప్పని నిరూపిస్తే పానకాల నరసింహ స్వామి సాక్షిగా పోటీ నుంచి విరమించుకుంటామని ఆయన అన్నారు. సోదర సిపిఎంపై ఆయన సోమవారం విరుచుకుపడ్డారు. మంగళగిరిలో సిపిఎం కాంగ్రెసు పార్టీకి సహకరిస్తోందని ఆయన తప్పు పట్టారు. వరంగల్ జిల్లాలో సిపిఎం ఇతర పార్టీలతో కుమ్మక్కయిందని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ రంకుమొగుడి పాత్ర నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications