ఎల్టీటిఇపై అలా అనలేదు: కరుణ

రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటిఇని క్షమించలేమని ఆయన అన్నారు. శ్రీపెరంబుదూర్ సంఘటనను మర్చిపోదామని కూడా తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు.ఎల్టీటిఇ లక్ష్యం మంచిదేనని, అయితే దాని సాధనకు అది ఎంచుకున్న మార్గమే సరైంది కాదని ఆయన అన్నారు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెసు పార్టీ కరుణానిధి ఆదివారం మాట్లాడిన వెంటనే ప్రతిస్పందించింది. అయితే కరుణానిధిపై తీవ్రమైన విమర్శలు చేయలేదు. కాంగ్రెసు ఇరకాటంలో పడడంతో కరుణానిధి తాను చేసిన ప్రకటనపై సోమవారం వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications