నిఘా శాటిలైట్ ప్రయోగం సక్సెస్

సోమవారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన వర్క్ హార్స్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పిఎస్ఎల్వీ) గగనతలంలోకి దూసుకెళ్లింది.ఇది భారతదేశానికి అద్భుతమైన నూతన సంవత్సరం కానుక అని ఇస్రో చైర్మన్ జి.మాధవన్ నాయర్ అన్నారు. తమకు చాలా ఆనందంగా ఉందని, వెహికిల్ బాగా పనిచేస్తోందని ఆయన అన్నారు. తాము ఈ ఏడాది రిసోర్స్ సాట్, ఓసియన్ సాట్, ఇతర ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశీయంగా రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ ను ఈ ఏడాది ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications