హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాన సేవకుడు చిరుయే: అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్‌: ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, చిరంజీవి రాష్ట్రానికి ప్రధాన సేవకుడు(ముఖ్యమంత్రి) అవుతారని ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌ ధీమా వ్యక్తం చేశారు. చాలామంది ఫలితాల తరువాత తమను కింగ్‌ అవుతారా, కింగ్‌ మేకర్‌ అవుతారా? అని అడుగుతున్నారని, తాము కచ్చితంగా కింగ్‌ అవుతామని ఆయన గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. మే 16 తరువాత రాష్ట్రంలో అసలైన ప్రజాస్వామ్యం వస్తుందని ఆయన అన్నారు. చిరంజీవిపై ప్రేమతో, ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ప్రజలు ఓటు వేశారని తెలిపారు. రెండో విడతలో బరిలో ఉన్న 142 మంది పార్టీ అభ్యర్థులతో తాను మాట్లాడానని, గతంలో సందేహం ఉన్న స్థానాల్లోనూ గెలవబోతున్నామని వివరించారు. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని విమర్శించారు. అక్కడ సైన్యం పర్యవేక్షణలో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని కూలదోయటానికి, కాంగ్రెస్‌ కు బుద్ధి చెప్పేందుకు జనం ఓట్లు వేశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో తమకు తెలుగుదేశంతోనే ప్రధాన పోటీ నడిచిందని అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హడావిడి ఎక్కువగా కనిపించినా, తెలుగుదేశం పార్టీయే అసలైన పోటీనిచ్చిందని పేర్కొన్నారు. పాలకొల్లులోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే చిరంజీవికి పోటీ ఇచ్చారని అన్నారు. తిరుపతిలో చిరంజీవిని అడ్డుకోనేందుకు కాంగ్రెస్‌, తెదేపా కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.

వైఎస్‌ పదవీ విరమణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రజారాజ్యం నేత పి.ఉపేంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యంతరకర, ఆశ్చర్యకర పథకాలను ప్రచారంలో పెట్టినా ఫలితం రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ముఠాసంస్కృతి కొనసాగకుండా ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసిందని ప్రజారాజ్యం మరో నేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రరాపాపై విషప్రచారం జరిగినా, చాలామంది అభ్యర్థులు డబ్బుల్లేక ఇబ్బందిపడినా అద్భుత విజయం సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X