ప్రాణాలైనా ఇస్తా, పదవి వదల: బూటా

Buta Singh
న్యూఢిల్లీ: ప్రాణాలైనా ఇస్తాను గానీ పదవికి రాజీనామా చేయబోనని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బూటా సింగ్ అన్నారు. తాను పార్టీ కార్యకర్త కన్నా రాజ్యాంగ పదవికి సంబంధించిన కార్యకర్తనని ఆయన మంగళవారం అన్నారు. తనను తాను సమర్థించుకోగలనని, తనకు పార్టీ మద్దతు అవసరం లేదని ఆయన అన్నారు. తాను దళిత సంరక్షకుడినని ఆయన చెప్పుకున్నారు. జీవితాంతం దళితుల కోసం పని చేశానని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే ప్రాణాలైనా ఇస్తానని ఆయన అన్నారు.

తనకు కాంగ్రెసు పార్టీ మద్దతు అవసరం పడుతుందని అనుకోవడం లేదని, తాను సత్యంతో నడుస్తున్నానని, అందువల్ల తనను తాను సమర్థించుకోగలనని ఆయన అన్నారు. నాసిక్ కు చెందిన రామారావు పాటిల్ నుంచి కోటి రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణపై సిబిఐ బూటా సింగ్ కుమారుడు సరోబ్జిత్ సింగ్ ను అరెస్టుచేసింది. తాను దళితుల కోసం పని చేశానని, వారి సమస్యలను పార్లమెంటులోనూ, పార్లమెంటు వెలుపలా రాజకీయాల్లో లేవనెత్తుతూ వస్తున్నానని ఆయన అన్నారు. తనను అంతం చేయడానికి రామారావు పాటిల్ తో దళిత వ్యతిరేకులు కుమ్మక్కవుతున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+