హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ చాపర్ క్రాష్: కుట్ర లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో ఏ విధమైన కుట్ర లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు సమాచారం. గాలి వేగంగా వీయడం వల్లనే హెలికాప్టర్ కూలిపోయినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్లడానికి హెలికాప్టర్ పౌర విమాన యానాల నిబంధనల ప్రకారం 4,100 అడుగుల ఎత్తుల వెళ్లాల్సి ఉంటుంది. నల్లమల అడవుల్లో పావురాల గుట్ట 1800 అడుగుల ఎత్తులో ఉంది. వైయస్ హెలికాప్టర్ 3,400 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలుగా దిగాల్సి ఉంటుంది.

ఆ పరిస్థితిలో హెలికాప్టర్ బలమైన గాలుల వల్ల ఏటవాలుగా కిందికి వచ్చిందని, దీని వల్ల హెలికాప్టర్ చెట్లకు ఢీకొని కూలిందని నిపుణులు అభిప్రాయపడినట్లు ఒక తెలుగు టీవీ చానెల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. హెలికాప్టర్ పావురాల గుట్టను ఢీకొనలేదని కూడా నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపింది. హెలికాప్టర్ శకలాలు కిలోమీటరు పరిధిలోనే పడి ఉండడాన్ని వారు అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కాగా, పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ కార్యాలయం అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. బుధవారం డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ఎవరి అలసత్వం గానీ నిర్లక్ష్యం గానీ లేదని రమాకాంత్ రెడ్డి చెప్పారు. వారిద్దరు సంఘటనా స్థలాన్ని సందర్శించడం పట్ల డిజిసిఎ అసహనం వ్యక్తం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X