నా హత్యకు కుట్ర: మమతా బెనర్జీ

అప్పటికే చాలా ఆలస్యమైందని, వీధి దీపాలు లేవని, ఓ ప్రైవేట్ కారు తన కాన్వాయ్ లోకి దూసుకొచ్చి తన కారు వెనక్కి వచ్చిందని, అది తన కారును ఢీకొట్టడానికి ప్రయత్నించిందని, దాన్ని తప్పించుకోవడానికి చూశామని, అయితే ఆ తర్వాత కూడా అది తన కారు వెనక్కి వచ్చిందని ఆమె చెప్పారు. ఇటువంటి సంఘటనలు నాలుగైదు సార్లు జరిగినట్లు తెలిపారు. తన కాన్వాయ్ లోని పోలీసులు ఆగాలని ఆ కారు ప్రయాణికులకు సూచించారని, అయినా వినలేదని, కాల్పులు జరపవద్దని తాను పోలీసులకు సూచించానని ఆమె చెప్పారు.
తమకు ఫిర్యాదు అందిందని, అది ప్రెస్ కారు అని తేలిందని, ఎవరిని కూడా అరెస్టు చేయలేదని రాష్ట్ర పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) సురజీత్ కార్ పురకాయస్థ చెప్పారు. చివరికి కారును ఆపగలిగామని, డ్రైవర్ వద్ద లైసెన్స్ లేదని, కెమెరాలు ధరించిన వారి వద్ద ఏ విధమైన ప్రెస్ గుర్తింపు కార్డులు లేవని మమత చెప్పారు.












Click it and Unblock the Notifications