కర్నూలు: క్షమాపణ చెప్తేనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును వదిలేస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. కెసిఆర్ వాడుతున్న భాషపై ఆయన మంగళవారం తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెసిఆర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారం కేసు వేస్తామని ఆయన మీడియా ప్రతినిధులు చెప్పారు. పెన్ డౌన్, గౌన్ డౌన్, రక్తపాతం అంటే కెసిఆర్ ను జైలులో పెడతారని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ ను ఫ్రీజోన్ చేయడం వల్ల తెలంగాణకే మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాష్ట్రాన్నంతా ఫ్రీజోన్ చేయాలని కోరుతామని ఆయన చెప్పారు.