• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈ రోజు నుంచే భాష మార్చుకుంటా: కెసిఆర్

By Pratap
|

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఈ రోజు నుంచే తన భాషను మార్చుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. ఇక నుంచి తన భాషపై చర్చ జరగకూడదని ఆయన అన్నారు. తెలుగు టీవీ చానెల్ టీవీ 9 నిర్వహించిన న్యూస్ వాచ్ కార్యక్రమం చర్చలో భాగంగా ఆయన ఈ విషయం చెప్పారు. తనపై అసభ్యంగా ఎవరైనా మాట్లాడితే ఆంధ్ర మేధావుల సంఘం ఖండించాలని కూడా ఆయన షరతు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ నాలుగో వారంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన చెప్పారు.

మౌలికాంశాలపై చర్చకు తాను సిద్ధమేనని కెసిఆర్ చెప్పారు. టీవీ 8 నాలుగు ప్రాంతాల మేధావులు, ప్రముఖులతో మౌలికాంశాలపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చింది. రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీవీ 9 ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు చెందిన మేధావులను, నిపుణులను ఈ చర్చా కార్యక్రమానికి ఆహ్వానించాలని కెసిఆర్ సూచించారు. కెసిఆర్ పై ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తాను ఖండిస్తానని ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు శ్రీనివాస్ అంగీకరించారు.

తాను ఏమీ అసభ్యంగా మాట్లాడడం లేదని, తమ ప్రాంత నానుడులనే వాడుతున్నానని కెసిఆర్ సోమవారం చెప్పారు. పదాలకు అర్థాలు కూడా ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో సాధారణంగా వాడే బుల్లి వంటి పదాలు తెలంగాణలో వాడితే ఎలా చూస్తారో కూడా ఆయన వివరించారు. ప్రాంతాలను బట్టి భాష స్వరూపం ఉంటుందని, తాను తన భాషలో మాట్లాడుతుంటే తిట్లుగా అభివర్ణిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X