హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు.
ఏకపక్ష వైఖరిని విడనాడాలని, సమిష్టిగా ముందుకు సాగాలని తాను కెసిఆర్ కు ఎన్నో సార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, కెసిఆర్ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ వల్ల తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు పోయాయని ఆయన అన్నారు.