కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న జీపు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మృతులు రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ బోరంపేట గ్రామవాస్తవ్యులు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి వెళ్లి స్వస్థలానికి జీపులో తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు.