శ్రీకాంత్ మృతదేహంతో భారీ ఊరేగింపు

అంతకు ముందు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాంత్ మృతదేహంతో ఉస్మానియా ఆస్పత్రి వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఈటెల రాజేందర్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతవరకు శ్రీకాంత్ మృతదేహానికి పోస్టు మార్టం చేయనివ్వబోమని హెచ్చరించారు. శ్రీకాంత్ కుటుంబానికి తెరాస శాసనసభ్యులు తమ నెల జీతాలను విరాళంగా ప్రకటించారు. ఎట్టకేలకు శ్రీకాంత్ మృతదేహానికి పోస్టు మార్టం జరిగింది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖఱ రావు అరెస్టుకు నిరసనగా ఆదివారంనాడు శ్రీకాంత్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు. అతన్ని అపోలో ఆస్పత్రి లో చేర్చారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతూ అతను శుక్రవారం ఉదయం మరణించాడు.