హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థినిపై నాలుగు నెలలుగా అత్యాచారం జరిపిన కీచకుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohammed Salahuddin Ayub
హైదరాబాద్‌: బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచక పాత్ర పోషించాడు. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత నీచమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి తమ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పార్క్ వుడ్ పాఠశాల డైరెక్టర్ మహ్మద్ అయూబ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులు ముంబయిలో ఉంటారు. మూడేళ్ల కిందట తమ కుమార్తెను 'పార్క్‌వుడ్‌'లో చేర్పించారు. పాఠశాల డైరెక్టర్‌ మహ్మద్‌ సలావుద్దీన్‌ అయూబ్‌(50) మార్చి నెలలో ఓ రోజు విద్యార్థినిని పెంట్‌ హౌస్‌ కు పిలిపించుకుని శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లాక అత్యాచారం చేశాడు. ఆ ఆమ్మాయికి మెలకువ వచ్చాక విషయం బయటకు చెప్పొద్దని బెదిరించాడు. అప్పటి నుంచి పలుమార్లు తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసేవాడు. బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో అయూబ్‌ ఉదంతం బయటపడింది.

అయూబ్ పాఠశాలలోని అమ్మాయిల వసతిగృహంపై పెంట్‌ హౌస్‌ లో ఉండేవాడు. వీలున్నప్పుడల్లా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడేవాడు. తన కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయం చూసి హైదరాబాద్‌ కు తీసుకువచ్చి నాలుగైదుసార్లు బలవంతంగా రేప్‌ చేశాడు. తన శరీరంలో మార్పులు రావడంతో కంగారు పడిన ఆ అమ్మాయి ఎదురుతిరగడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి 'మీ అమ్మాయి ప్రేమలో పడింది, వచ్చి గట్టిగా బుద్ధి చెప్పండి' అని చెప్పాడు. వారు ముంబయి నుంచి వచ్చి తమ కుమార్తెను ప్రశ్నించగా, అయూబ్‌ అత్యాచారం చేశాడని చెప్పింది. 11వ తరగతి చదువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులను అయూబ్‌ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్నాయి. అయూబ్‌ ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని సీసీఎస్‌ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులతో వచ్చి ఫిర్యాదు చేసిందని చెప్పారు. అయూబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి తుపాకీ, పిస్టల్‌, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయూబ్‌ 'వ్యవహారం'పై విచారణకు ఆదేశించినట్లు మంత్రి మాణిక్యవరప్రసాదరావు వెల్లడించారు.

అయూబ్ ‌ఖాన్‌ హైదరాబాద్‌ నివాసి. చిన్నప్పుడు హైదరాబాద్‌ పబ్లిక్ ‌స్కూల్ ‌లో చదువుకున్నాడు. విదేశాల్లో కొన్నాళ్లు ఉన్నత చదువులు చదివాడు. ఎనిమిదేళ్ల కిందట అంతర్జాతీయ ప్రమాణాలతో వికారాబాద్‌ సమీపంలోని మన్నెగూడ వద్ద పార్క్‌ వుడ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్ ‌ను ప్రారంభించాడు. పాఠశాల నిర్వహణ అంతా అయూబ్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో ఉంది. ప్రిన్సిపాల్‌ గా అయూబ్‌ ఖాన్‌ సోదరి అయేషా తన్వీర్‌ కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X