Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!

బాలీవుడ్ ఎనర్జీ బాంబ్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురందర్ 2' (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పెయిడ్ ప్రీమియర్ షోల నుండే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మన టాలీవుడ్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ ఈ సినిమా చూసి ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు 'రివెంజ్' ఫీవర్ మామూలుగా లేదు. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ ఆడియన్స్ కూడా ఈ స్పై థ్రిల్లర్ కోసం క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లోని తన సొంత థియేటర్ 'అల్లు సినిమాస్'లో ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్, సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.

dhurandhar-2-review-ranveer-singh-shines-in-stylish-spy-thriller-praised-by-allu-arjun-vijay-devarak

"దేశభక్తికి కొత్త నిర్వచనం" - అల్లు అర్జున్

సినిమా చూసిన తర్వాత బన్నీ తన రివ్యూను షేర్ చేస్తూ.. "ధురందర్ 2 అంటే దేశభక్తికి స్వాగ్ జోడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమాను తీశారు. థియేటర్లలో ఈలలు, చప్పట్లు కొట్టించే క్షణాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఇదొక బ్లాస్ట్!" అని కొనియాడారు.

రణవీర్ సింగ్ అరాచకం

ముఖ్యంగా రణవీర్ సింగ్ నటన గురించి మాట్లాడుతూ.."నా సోదరుడు రణవీర్ సింగ్ లాంటి ప్రతిభావంతుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి మన దేశంలో ఉండటం గర్వకారణం.రణవీర్ ఈ సినిమాలో నిప్పులు చెరిగాడు (On Fire). అలాగే ఆర్. మాధవన్ సహా ఇతర నటీనటులు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు" అని బన్నీ ప్రశంసించారు.

దర్శకుడు ఆదిత్య ధర్ 'సిక్సర్'

'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' వంటి భారీ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఈ సినిమాతో మళ్ళీ 'బంతిని స్టేడియం వెలుపలికి కొట్టేశాడు'అని అల్లు అర్జున్ అభివర్ణించారు.టెక్నికల్‌గా ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉందని, ఇలాంటి దర్శకులు మన దేశానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

రౌడీ బాయ్ రివ్యూ

సినిమా అధికారిక విడుదల రోజు అంటే మార్చి 19వ తేదీన భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప కార్యం జరగబోతోందంటూ కొత్త పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ దురంధర్ సినిమా చూశాక ఎక్స్‌లో పోస్టు చేశాడు. నాలుగు పదాలు మాత్రమే చెప్పదలుచుకున్న అని చెప్పిన రౌడీ బాయ్.. "భారత్ మాతా కీ జై" అని ముగించాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ విజయ్ అభినందిస్తూ వారి అంకితభావం పట్ల తనకు ప్రేమ గౌరవం పెరిగాయని వెల్లడించాడు.

ప్రీమియర్ షోలకే పాజిటివ్ టాక్ రావడంతో, తొలిరోజే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.గతంలో ఉన్న స్పై థ్రిల్లర్ రికార్డులను 'ధురందర్ 2' తుడిచిపెట్టే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.అల్లు అర్జున్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా రణవీర్ నటనను, మేకింగ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

"ఇంటర్నేషనల్ స్వాగ్‌తో కూడిన ఇండియన్ స్టోరీ" అని అల్లు అర్జున్ చెప్పిన మాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. మరి రణవీర్ సింగ్ తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నట్లేనని సినీ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+