హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు నిరవధిక దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రైతులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించడానికి జాతీయస్థాయి నేతలైన ఎండీఎంకే అధినేత వైగో, బాబూలాల్‌మరాండీ, అజిత్‌సింగ్‌, సీతారాంఏచూరితోపాటు ఏఐడీఎంకే ప్రతినిధులు బాబు దీక్షకు సంఘీభావంగా హైదరాబాద్‌ రానున్నారు.

మూడోరోజు చంద్రబాబుతో పాటు వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు దీక్షలో కూర్చోనున్నారు. మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. బాబును పరామర్శించడానికి తెలంగాణలోని పలు జిల్లాలనుండి వేలమంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. వరంగల్ నుండి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 1500 మంది కార్యకర్తలు రానున్నారు.

కాగా శనివారం మాజీ ప్రధానమంత్రి దేవేగొడ, కమ్యూనిస్టు నాయకుడు ప్రకాశ్ కరత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబును కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, బావమరిది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం సతీమణి భువనేశ్వరి దీక్షా శిబిరానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X