LPG Helpline: గ్యాస్ డెలివరీ ఆలస్యమవుతోందా ? హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..!
ఇరాన్ సంక్షోభం కారణంగా తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్బీజీ (LPG) సిలెండర్ల కృత్రిమ కొరత ఏర్పడింది. ఎవరికి వారు భయాలతో సిలెండర్లను తమ వద్దే ఉంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలెండర్లు దొరక్క మిగిలిన వారు అల్లాడిపోతున్నారు. గ్యాస్ కంపెనీల వద్దకు క్యూ కడుతున్నారు. మరికొందరు గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకున్నా తమకు డెలివరీ కావడం లేదని వాపోతున్నారు. ఇలాంటి వారి కోసం చమురు కంపెనీలు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశాయి.
గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకున్న తర్వాత రెండున్నర రోజుల్లో డెలివరీ చేయాలని చమురు సంస్థలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే పలు చోట్ల బుక్ చేసుకున్న తర్వాత రెండున్నర రోజుల్లో డెలివరీ రావడం లేదు. అలాగే సిలెండర్ బుక్ చేయకపోయినా చేసినట్లు చూపిస్తూ బ్లాక్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్ ను బుక్ చేసుకున్న తర్వాత రెండున్నర రోజుల కంటే ఎక్కువ ఆలస్యం జరిగితే సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లను చమురు కంపెనీలు ప్రకటించాయి.

కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఆలస్యం అయితే....ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. అలాగే భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345 కు ఫోన్ చేయాలి. అలాగే HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చమురు కంపెనీలు కోరుతున్నాయి. అప్పుడు ఎక్కడ లోపం జరిగిందో వెంటనే గుర్తించి సిలెండర్ డెలివరీకి చర్యలు తీసుకుంటారు.













Click it and Unblock the Notifications