తిరుపతి, అరుణాచలం కు కొత్త రైళ్లు- ప్రధాన రైళ్లల్లో తాజా మార్పులు - షెడ్యూల్..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఇప్పుడు స్పెషల్ రైళ్లుగా నడుస్తున్న మూడు రైళ్లను రెగ్యులర్ చేసారు. అదే విధంగా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలోనూ తాజాగా మార్పులు చేస్తూ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్లే రైళ్ల వేళలను అధికారులు ఖరారు చేసారు. దీని ద్వారా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కలగనుంది. తాజా వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది.
గత ఐదు సంవత్సరాలుగా నాంపల్లి - కన్యాకుమారి(ట్రైన్ నెంబర్ 07229/07230) ఎక్స్ ప్రెస్ వీక్లీ రైళ్లుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ గా అందు బాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ నెంబర్ ను మార్చారు. రెగ్యులర్ సర్వీస్ గా మారిన నేపథ్యంలో నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ నెంబర్ 17069/17070గా మార్పు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5:20 నిమిషాలకు బయలుదేరే (ట్రైన్ నంబర్ 17069) ఎక్స్ ప్రెస్ రెండో రోజు ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 05:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి (ట్రైన్ నంబర్ 17070) ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

తిరుపతి ప్రయాణీకులకు వెసులుబాటు
కాగా..నాంపల్లి నుంచి అరుణా చలం వెళ్లే రెగ్యులర్ ఎక్స్ ప్రెస్.... సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది. రెగ్యులర్ సర్వీస్ గా మార్పు చేయటంతో భక్తులకు ప్రయోజన కరంగా మారనుంది. కాచిగూడ-మధురై-కాచిగూడ రైలు (నం.07191/07192)ను కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్(17165/17616) రైలుగా మార్పు చేసారు. ఇక.. చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలు (07225/07226)ను చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (17065/17066) రైలుగా మార్పు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications