నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో ఉండాలి: డిజిపి

ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడమే మా బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 కంపెనీల బలగాలను మోహరించామని, మరో 33 కంపెనీలు రానున్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడ ఆవేశాలకు లోను కావొద్దని కోరారు. ఆంధ్రా-ఒరిస్సా, ఆంధ్రా-ఛత్తీసుఘడ్ రాష్ట్రాల సరిహద్దులలో మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పారు. విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజనులు మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications