హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ ను దుయ్యబట్టిన నారా లోకేష్ స్టూడియోఎన్ చానెల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా ఈ నెల 22వ తేదీన విశాఖపట్నంలో ధర్నా చేస్తానని ప్రకటించిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి కుమారుడు నారా లోకేష్‌కు చెందిన స్టూడియోఎన్ టీవీ చానెల్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఈ మేరకు మంగళవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జగన్ ప్రకటన వెలువడిన మరుక్షణం ఈ వార్తాకథనం ఆ చానెల్లో ప్రసారమైంది. జగన్ చంద్రబాబును అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించింది. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 22వ తేదీన తమ పార్టీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతుందని చంద్రబాబు ముందే ప్రకటించారని, చంద్రబాబు ప్రకటన వెలువడిన తర్వాత తాను ధర్నా చేయనున్నట్లు జగన్ ప్రకటించారని చానెల్ వివరించింది. ఈ వివరణతో సరిపుచ్చకుండా జగన్‌పై స్టూడియోఎన్ ప్రతినిధులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైయస్ జగన్ ‌కు సొంత ఎజెండా లేదని, రాజకీయానుభవం లేదని, అందువల్లనే ఓ ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహారాలు నడుపుతున్నారని ఆ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఓ కార్యకర్తకు ఉన్న అనుభవం కూడా జగన్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెసు పార్టీని జగన్ వీడడాన్ని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా అభివర్ణించారు. డబ్బు సంపాదించిన జగన్ దాంతో దేనినైనా కొనగలమని భావిస్తున్నారని అన్నారు. ఓదార్పు యాత్రను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్ర బలప్రదర్శనలాగా సాగుతోందని విమర్సించారు. స్టూడియోఎన్ వ్యాఖ్యలతో కాంగ్రెసు పార్టీకి ఓదార్పు లభించేట్లే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X