వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
28వ తేదీన తెలంగాణ పార్టీ ఎంపీలతో ప్రణబ్ ముఖర్జీ భేటీ

ముందుగా బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేందుకు ఎంపీలు సహకరించాలని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. సమావేశాలు సాఫీగా సాగిన తర్వాత తెలంగాణకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఎంపీలు రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరించడం, గత డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించిన హామీకి కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేయడం వంటి తదితర పరిణామాల దృష్ట్యా తెలంగాణ సమస్యకు తొందరగా పరిష్కారం కనుగునే దిశలో కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.