• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ జగన్ సాక్షిపై టిడిపి అధినేత చంద్రబాబు నిప్పులు

By Srinivas
|

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక ఓ అక్రమాల పుట్ట అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్‌లో కొందరు పెట్టుబడులు అక్రమంగా పెట్టినట్టు ఐటి శాఖ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఈ విషయంపై లేఖ ఇచ్చామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు చేస్తారనో, పనులు చేయబోతారనో కొందరు పెట్టుబడులు పెట్టారన్నారు. అయితే తాము ప్రభుత్వం నుండి లాభం పొందినందుకే వారు లాభాలతో నిమిత్తం లేకుండా పెట్టుబడులు పెట్టారన్నారు. పేదల సొమ్మును వైయస్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. వైయస్ ముడుపులే సాక్షి పెట్టుబడులన్నారు. 20 పర్సెంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వారికి 90 పర్సెంట్ రాగా, 80 పర్సెంట్ పెట్టిన వారికి 10 పర్సెంట్ దక్కిందన్నారు. అనుభవం లేని వ్యక్తి పేపర్ పెడితే దానిపై పెట్టుబడుల వరదలు రావడం ప్రపంచంలో ఇదే ప్రథమమని అన్నారు.

వైయస్ నుండి లబ్ధి పొందిన వారే సాక్షిలో పెట్టుబడులు పెట్టారన్నారు. దీంతో పేదలకు చెందాల్సిన డబ్బు సాక్షిలోకి తరలిపోయిందన్నారు. కుప్పలు తెప్పలుగా సాక్షి కోసం బోగస్ కంపెనీలను సృష్టించారన్నారు. జగన్ సాక్షి అక్రమాల పుట్ట అని ఎవరో చెప్పింది కాదని, ప్రభుత్వ సంస్థ ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ స్వయంగా చెప్పిందే అన్నారు. ఇంత బాహాటంగా అవినీతికి పాల్పడినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుందన్నారు. వైయస్ అవినీతితో పేదల పొట్టలు కొట్టారన్నారు. మనీ లాండరింగ్‌తో షెల్ కంపెనీలు పుట్టించి పరిశ్రమను స్థాపించారన్నారు. వైయస్ కుటుంబం అవినీతిలో ఐటి చెప్పింది ఒక శాతం మాత్రమే అన్నారు. మాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదన్నారు. అయితే అవినీతిని మాత్రం సహించేది లేదన్నారు. అవినీతితో వైయస్ కుటుంబం సంపాదించుకున్న డబ్బును రికవరీ చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పాలన్నారు. డబ్బు రికవరీ చేయకపోవడం ప్రధాని, ముఖ్యమంత్రి చేతకానితనం కాదా అని ఆయన ప్రశ్నించారు.

2జి స్పెక్ట్రంపై జెపిసి ఎలా అయితే వేసారో, జగన్ అక్రమాలపై జెఎల్‌సీ వేయాలని డిమాండ్ చేశారు. వైయస్ ఉన్నప్పుడే రాజా ఆఫ్ కరెప్షన్ పేరుతో వైయస్ కుటుంబం అక్రమాలు టిడిపి అన్ని పార్టీలతో కలిపి విడుదల చేసిందన్నారు. వారి మైనింగ్ అక్రమాలపైనా పుస్తకం వేశామని చెప్పారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు వారి అవినీతి బయటకు వస్తుందని అన్నారు. వైయస్ అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్నారు. ఇష్టానుసారం ఎలా దోచుకుంటే దేశం ఏమై పోవాలన్నారు. జగన్ ఆస్తులపైన మళ్లీ సిబిఐ ఎంక్వయిరీ జరగాలన్నారు. అవినీతిపరులందరిపైనా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి చేయకుండా అడ్డుకోవాలన్నారు. అవినీతి చేయడానికి భయపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసే వరకు తెలుగుదేశం పోరాడుతుందన్నారు. అవినీతికి ఎంతటి స్థాయి వారు పాల్పడ్డా వదిలి పెట్టకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవినీతిపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న భారత్ అవినీతి వల్ల వెనక పడిపోతుందన్నారు.

English summary
TDP president Nara Chandrababu Naidu fired at Ex MP YS Jaganmohan Reddy's Sakshi today in media conference at NTR trust bhavan. He demanded JLC on YS Jagan corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X