ఎట్టకేలకు జీతాలు విడుదల: సహాయ నిరాకరణపై నిర్ణయం వచ్చే నెల
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఫిబ్రవరి నెల వేతనాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యోగులు 17నుండి సహాయ నిరాకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మొదట ఉద్యోగులకు 16 రోజుల వేతనాన్నే విడుదల చేయాలి అనుకున్నప్పటికీ ఉద్యోగులు మొత్తం జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికి సహాయ నిరాకరణలో పాల్గొన్న ఉద్యోగులకు ఫిబ్రవరి నెలలోని 28 రోజులకూ జీతాన్ని విడుదల చేసింది.
కాగా ఫిబ్రవరి నెలకు పూర్తి జీతం విడుదల చేసినప్పటికీ సహాయ నిరాకరణలో ఉద్యోగులు పని చేయని రోజులపై ప్రభుత్వం వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సహాయ నిరాకరణ చేసిన రోజులను ఏవిధంగా పరిగణించాలనే అంశంపై చర్చించిన తర్వాత వచ్చే నెల ప్రభుత్వం నిరాకరణ దినాల జీతంపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులు పని చేయకున్న మొత్తం జీతం కట్టిస్తే సీమాంధ్రుల మిగతా ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు అందుతాయనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Government released Telangana empolyees february month salary today. Government released 28 days salary today. Government will decided on employees non co-operation salary on next month.
Story first published: Monday, March 7, 2011, 18:17 [IST]