వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి
హిందూమతంలో వాస్తు శాస్త్రంకు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు శాస్త్రం అనేక సలహాలిచ్చి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవడం, రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక చికాకుల్లాంటివన్నింటినీ తొలగించడానికి వాస్తు తోడ్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కోసారి పెద్దవిగా మారతాయి. వాటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
బ్యాంకులో డబ్బు మంగళవారం లేదా శుక్రవారం మాత్రమే జమ చేయాలి.
మంగళవారం, శుక్రవారం రెండూ దేవతలకు సంబంధించి శుభకారకాలుగా భావిస్తారు.
లక్ష్మీదేవి సంపదకు అధిదేవత.
ఈ రెండు రోజుల్లో డబ్బును నిల్వ చేసుకుంటే కలిసివస్తుంది.
దీంతోపాటు డబ్బు నిల్వ ఉంటుంది.

ఇంట్లో ఉత్తర దిశ గోడపై కుబేరుడి ఫోటో ఉంచాలి.
కుబేరుడు సంపదకు అధిపతి.
ఉత్తర దిశ ఆయనకు అత్యంత ఇష్టమైన దిశ.
బీరువా లేదా లాకర్‌ను నైరుతి మూలలో ఉంచాలి.
బీరువా వెనుక భాగం దక్షిణం వైపు ఉండాలి.
అది తెరిచినప్పుడు ఉత్తరం వైపునకు చూడాలి.
ఉత్తరం కుబేరుడి దిక్కు కాబట్టి,
ఆ దిశ నుంచి వచ్చే శక్తి ధనాన్ని ఆకర్షిస్తుంది.
బీరువా నేరుగా నేలపై ఉండకూడదు.
దాని కింద చిన్న చెక్క పీట లేదా స్టాండ్ ఉంచడం మంచిది.
ఇంట్లో ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలి.
ఇక్కడ బరువైన వస్తువులను పెట్టకూడదు.
ఈ మూలలో ఒక చిన్న పాత్రలో నీరు పోసి ఉంచాలి.
చిన్న వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.
దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
ఉత్తర దిశలో నీలం రంగు పెయింట్ వేయడం
లేదంటే మనీ ప్లాంట్ పెంచడం శుభప్రదం.
ఉత్తరం వైపు గోడకు కుబేర యంత్రాన్ని ఉంచాలి.
లేదంటే లక్ష్మీదేవి గజలక్ష్మి రూపంలో ఉన్న ఫోటోను తగిలించాలి.
దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications