హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపే సూపర్ మూన్, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Super Moon
హైదరాబాద్: సూపర్ మూన్ రేపే (శనివారంనాడే) భూమిని కాంతివంతం చేయనుంది. చంద్రుడు భూమికి చేరువ కావడం వల్ల ఇది ఏర్పడుతోంది. దీనివల్ల భూమి చంద్రుడి కాంతితో వెలిగిపోతుంది. అయితే, దీనిపై జ్యోతిష్కులు భయాందోళనలు కలిగించే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని జోస్యం చెబుతున్నారు. శుక్రవారం నాడు విశాఖపట్నం తీరంలో సముద్రం వెనక్కి పోయిందని, అలలు వెనక్కి పోయాయని వార్తలు వెలువడ్డాయి. ఇదంతా సూపర్ మూన్ ప్రభావమేనని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రేపు సూపర్ మూన్ వల్ల ప్రమాదం వాటిల్లవచ్చునని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో తెలుగు టీవీ చానెళ్లన్నీ దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి.

జ్యోతిష్కుల అభిప్రాయాలను శాస్త్రవేత్తలు, హేతువాదులు ఖండిస్తున్నారు. జపాన్ సునామీ, న్యూజిలాండ్ భూకంపం కూడా సూపర్ మూన్ ప్రభావం వల్లనే చోటు చేసుకున్నాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. అయితే, అదంతా నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని, కదలికలు వస్తాయని, అవి రెక్టర్ స్కేలుపై 6 దాటితే ప్రమాదాలు సంభవిస్తాయని, దీనికి సూపర్ మూన్‌కు సంబంధం లేదని చెబుతున్నారు. సూపర్ మూన్ వెలుగులను హాయిగా ఆనందించాలని వారు సూచిస్తున్నారు. అయితే, సూపర్ మూన్ ప్రభావం వల్ల రెండు రోజుల్లో మూడు గ్రహాలను చూడడానికి వీలవుతుందని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి పశ్చిమ దిశగా గురు, బుధ గ్రహాలను చూడవచ్చునని చెబుతున్నారు. తూర్పు దిశగా చంద్రుడి చుట్టూ ఓ రేఖలాగా శనివారం శని గ్రహాన్ని చూడవచ్చునని అంటున్నారు.

కాగా, జ్యోతిష్యం భూకేంద్రంగా నడుస్తుందని, నిజానికి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని శాస్త్రం నిరూపించిందని, అయితే, భూమి చుట్టూ సూర్యుడు, మిగతా గ్రహాలు సంచరిస్తాయని జ్యోతిష్కులు భావిస్తారని వారంటున్నారు. జ్యోతిష్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సూపర్ మూన్‌ను చూస్తే మంచిది కాదనేది కూడా నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
We can see super moon tommorrow. As moon comes to near to globe, super occures. Scientists say that there will no disasters during super moon and it is a natural process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X