• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అత్యాచారం కేసులో దమ్ మారో దమ్ నిర్మాతకు హైకోర్టు నోటీసు

By Pratap
|

Dum Maro Dum
పానాజీ: అత్యాచారం కేసులో నిందితుడైన దమ్ మారో దమ్ చిత్ర నిర్మాత జాన్ ఫెర్నాండెజ్‌కు గోవాలోని బొంబాయి హైకోర్టు నోటీసు ఇచ్చింది. రష్యా మహిళ అత్యాచారం కేసులో మార్గో జిల్లా, సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఫెర్నాండెజ్‌ను ఆదేశించింది. 2009 డిసెంబర్‌లో ఓ రష్యా మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై ఫెర్నాండెజ్ 15 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు.

ఫెర్నాండెజ్‌కు ఏప్రిల్ 1వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా రాష్ట్ర విడిచి వెళ్లకూడదని కోర్టు అతనికి షరతులు పెట్టింది. ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

English summary
he high court of Bombay at Goa on Thursday issued a notice to rape accused John Fernandes asking him to show cause as to why bail granted to him by Margao district and sessions court in the Russian womans rape case should not be cancelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X