మల్లికా షెరావత్‌పై దాడికి ప్రయత్నాలు చేసిన వ్యక్తి అరెస్టు

Mallika Sherawat
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై దాడి చేయాలని భావించిన వ్యక్తిని ఢిల్లీ తూర్పు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఐదేళ్ల క్రితం రాజేష్ దలాల్ అనే పాత నేరస్థుడు మల్లికా షెరావత్‌పై దాడికి పథకం రచించినట్లు ఆరోపణలున్నాయి. 35 ఏళ్ల రాజేష్ దలాల్‌పై 13 క్రిమినల్ కేసులున్నాయి. దలాల్‌ను అతని అనుచరుడు రాజీవ్‌తో పాటు అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి ఒపి మిశ్రా చెప్పారు. వారి నుంచి 9ఎంఎం పిస్టల్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

గ్రాడ్యుయేట్ అయిన రాజేష్ దలాల్ తండ్రి న్యాయవాది. 2006 అక్టోబర్‌లో జాట్లను కించపరిచే విధంగా మల్లికా షెరావత్ వ్యాఖ్యలు చేసిందనే కోపంతో దలాల్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నట్లు పోలీసులు చెప్పారు. ముంబైలోని బాంద్రాలో గల మల్లికా షెరావత్ ఇంటి వద్ద అతను రెక్కీ కూడా నిర్వహించాడు. పాత కేసుల్లో 2006 నవంబర్‌లో ఢిల్లీ, ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మూడేళ్ల పాటు తీహార్ జైల్లో ఉన్నాడు. అ తర్వాత పిరోల్‌పై విడుదలయ్యాడు. పరీక్ష రాయాలనే సాకుతో పెరోల్ పొందిన రాజేష్ దలాల్ తిరిగి జైలుకు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+