హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తే వెంటనే ఆమోదిస్తామని బుచ్చయ్య చౌదరి చేసిన ప్రకటనపై హరికృష్ణ అక్షింతలు వేసినట్లు సమాచారం. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హరికృష్ణ బుచ్చయ్య చౌదరిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాల ఇంచార్జీ బుచ్చయ్య చౌదరి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వర్గం, హరికృష్ణ వర్గం మధ్య తలెత్తిన వివాదాలు ఇటీవల కాలంలో తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న రాజకీయల నేపధ్యంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవికి వంశీ నిన్న రాజీనామా చేశారు. హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాను ఏ నిర్ణయమూ తీసుకోలేనని బుచ్చయ్య చౌదరి చేతులెత్తేసినట్లు చెబుతున్నారు.
It is said that Nadamuri Harikrishna has expressed anguish at TDP senior leader Bucchaih Chowdary. Harikrishna warned Chowdary not involve in their affairs.
Story first published: Tuesday, April 12, 2011, 18:16 [IST]