నాగం జనార్దన్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు చంద్రబాబు రెడీ?

గతంలో నాగం జనార్దన్ రెడ్డి తప్పులు చేసినా ఉపేక్షించామని, ఇప్పుడు నాగం తీరు పరాకాష్టకు చేరుకుందని చంద్రబాబు సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తనకు ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నట్లు చంద్రబాబు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. జగన్‌తో తాను చంద్రబాబును పోల్చలేదని నాగం జనార్దన్ రెడ్డి శనివారం ఉదయం చెప్పారు.












Click it and Unblock the Notifications