వైయస్ జగన్ ఎఫెక్ట్: వైయస్ఆర్ పార్టీ పేరుకు నిండుతున్న కల్లుకుండలు

రామయ్య తన తాటి చెట్లలో ఓ దానికి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అని, మరో దానికి కాంగ్రెసు పార్టీ అని నామకరణం చేశాడు. అయితే ఆ రెండు చెట్లలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అని పేరు పెట్టిన తాటి చెట్టుకు కట్టిన కుండ పూర్తిగా నిండగా, కాంగ్రెసు అని పేరు పెట్టిన తాటి చెట్టుకు కుండా మాత్రం పావు వంతు కూడా నిండటం లేదు. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. జగన్‌కు తాటి చెట్లు కూడా మద్దతు పలుకుతున్నాయని అంటున్నారు. జగన్ కడప ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్‌పై అభిమానంతో తనకు తాటి కల్లు ఎక్కువగా వచ్చే చెట్టుకు జగన్ పార్టీ పేరు, తక్కువగా వచ్చే చెట్టుకు కాంగ్రెసు పార్టీ పేరు పెట్టాడనే మాటనూ కాదనలేము.












Click it and Unblock the Notifications