వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా ఫోజిచ్చి కుటుంబానికి షాకిచ్చిన టర్కిష్ మోడల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sila Sahin
బెర్లిన్: ఇరవై ఐదేళ్ల ముస్లిం మోడల్ ప్లేబాయ్ మ్యాగజైన్‌ కవర్ పేజీకి నగ్నంగా ఫోజు ఇచ్చి కుటుంబానికి షాక్ ఇచ్చింది. శీలా షాహిన్ అనే ఆ మోడల్ బెర్లిన్‌లో నివసిస్తున్న టర్కిష్ జర్మన్. టీవీ నటిగా ఆమె తన కుటుంబం తలెత్తుకుని తిరిగేలా చేసిన ఆమె ఇప్పుడు అదే కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. జర్మన్ ప్లేబాయ్ మ్యాగజైన్‌కు ఓ వక్షోజం పూర్తిగా కనిపించే విధంగా సెక్సీ ఫోజు ఇచ్చింది. స్వేచ్ఛ కోసమే తాను ఆ విధంగా చేశానని శీలా సాహిన్ అంటోంది. తన బాల్యం నుంచి ఓ ఛాందస కుటుంబంలో అనుభవించిన ఆంక్షల నుంచి తాను స్వేచ్ఛను పొందానని ఆమె అంటోంది.

శీలా సాహిన్ తల్లి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆమె తల్లి పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెబుతోంది. అయితే నటుడైన తండ్రితో మాత్రం మాట్లాడగలిగానని చెప్పింది. టర్కిష్ అమ్మాయిలు స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలోకి రావడానికే తాను ఆ విధంగా చేశానని ఆమె అంటోంది. తాను ఇంత స్వేచ్ఛను పొందినందుకు తన దేశస్థులు గొప్పగా భావిస్తారని ఆమె చెబుతోంది. తనను చాలా ఆంక్షల మధ్య పెంచారని ఆమె ప్లేబాయ్ మ్యాగజైన్‌కు చెప్పుకుంది. బయటకు పోవద్దని, అందంగా తీర్చి దిద్దుకోవద్దని, మగ మిత్రులు ఉండకూడదని తనకు ప్రతి నిమిషం గుర్తు చేస్తుండేవారని ఆమె వివరించింది.

English summary
Muslim model upsets family by posing nude for Playboy cover
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X