బాబా మరణంతో తల్లడిల్లిన సచిన్: హోటల్ గదిలో డోండ్ డిస్టర్బ్ బోర్డు

అయితే సచిన్ పరిస్థితి చూసిన సహచరులు అసలు సచిన్ ఆడటానికి వస్తాడా లేడా అనే టెన్షన్‌కు గురి అయ్యారని సమాచారం. మిగిలన ఆటగాళ్లు క్రికెట్ స్టేడియంకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కూడా సచిన్ రాలేదంట. దీంతో మిగతా ఆటగాళ్లు తీవ్ర ఆందోళన చెందారని సమాచారం. అయితే బస్సు బయలుదేరుతున్న క్షణాన సచిన్ వచ్చి బస్సులోకి ఎక్కాడు. అయితే ఎప్పుడు చిరు నవ్వుతో కనిపించే సచిన్ తీవ్ర నిస్పృహతో కనిపించారు. తాను ఒక్కడే వచ్చి బస్సు ఎక్కి ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే సచిన్ ఆడటానికి వస్తాడో లేదో అని ఆందోళన చెందిన ఆటగాళ్లు సచిన్ రావడంపట్ల సంతోషంగా ఉన్న సచిన్ పరిస్థితి చూసి మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారంట.












Click it and Unblock the Notifications