ఇదీ భగవాన్ సత్యసాయి కుటుంబం: కొండమరాజు వంశంలో బాబా

Sathya Saibaba
హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను కలిగిన ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ సత్యసాయిబాబా పెద వెంకమరాజు, ఈశ్వరమ్మల నలుగో సంతానం. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో బాబా 1926 నవంబర్ 23న కార్తీక సోమవారం రోజున జన్మించారు. బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబాకు ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. బాబా పెద్దన్నయ్య శేషంరాజు, ఆయన భార్య సుశీలమ్మ. ఆ తర్వాత అక్క వెంకమ్మ. ఆమె భర్త సుబ్బరాజు. ఆ తర్వాత మరో అక్కయ్య పార్వతమ్మ. ఆమె భర్త గోవిందరాజు. ఇక నాలుగో సంతానం సత్యనారాయణరాజు. అతడే కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం సత్యసాయి బాబా. ఆ తర్వాత జానకి రామయ్య. ఆయన భార్య మీనాక్షమ్మ. జానకి రామయ్య మరణించే వరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టులో సభ్యులు. ఆ తర్వాత ఆయన తనయుడు రత్నాకర రాజు ట్రస్టు సభ్యుడుగా కొనసాగుతున్నారు.

ఇక సత్యసాయి పెద్దన్న శేషంరాజుకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శేషంరాజు ఉపాధ్యాయుడు. పెద్ద అక్కయ్య వెంకమ్మకు ఒకే ఒక సంతానం. సత్యసాయి రెండో సోదరి పార్వతమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇక సాయి సోదరుడు జానకిరామయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఇప్పటికే బాబా తరం వారు మృతి చెందారు. ఆయన తరం ఆఖరి మజిలీ బాబాదే. రత్నాకర రాజు ప్రస్తుతం ట్రస్టు సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఇక వంశం విషయానికి వస్తే సత్యసాయిబాబా ముత్తాత శేషంరాజు, ఆయన భార్య పెద్ద లక్ష్మమ్మ. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె వెంకటసుబ్బమ్మ మొదటి సంతానం. ఆమె భర్త సుబ్బరాజు. కొండమ రాజు రెండో సంతానం. ఆయన భార్య లక్ష్మమ్మ. మూడో సంతానం సుబ్బరాజు. ఆయన భార్య నారాయణమ్మ. ఈ కొండమరాజు వంశంలోనే బాబా జన్మించారు. కొండమరాజు, లక్ష్మమ్మ దంపతులకే బాబా తండ్రి పెద వెంకమరాజు జన్మించారు. కొండమరాజుకు చినవెంకమరాజు అనే మరో తనయుడు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+