హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెనక్కి తగ్గిన జగన్ వర్గం పిఆర్పీ ఎమ్మెల్యే: చిరుతోనే కాటసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఇన్నాళ్లుగా ఉంటూ వస్తున్న ప్రజారాజ్యం పార్టీ కర్నూలు జిల్లా బనగానపల్లి శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాటసాని రామిరెడ్డి శుక్రవారం ఉదయం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యారు. తాను ప్రజారాజ్యం పార్టీలోనే ఉంటానని, తనపై చర్యలు తీసుకోవద్దని చిరంజీవిని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే పిఆర్పీ విప్ వంగా గీత ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ కాటసానికి, మరో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి తాఖీదులు జారీ చేసిన విషయం తెలిసిందే.

జగన్ తీరుపై కాటసాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన తిరిగి చిరంజీవితో ఉండటానికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన ఓ ముఖ్యమైన ఎమ్మెల్యే జగన్‌తో లెక్క విషయంలో విభేదాలు వచ్చి దూరం జరుగుతానని హెచ్చరించిన వార్తలు వచ్చాయి. అయితే అందరూ కూడా జగన్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే యూ టర్న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

English summary
PRP MLA Katasani Rami Reddy gave shock to Ex MP YS Jaganmohan Reddy today. He may take U turn. He met PRP president Chiranjeevi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X