సమైక్యవాదులకు షాక్: మహానాడు వేదికపై జై తెలంగాణ అన్న ఎర్రబెల్లి

కానీ ఓ పార్టీ జరుకుంటున్న వేడుకలో ఎర్రబెల్లి ఆ తర్వాత మరో ఎమ్మెల్యే కెఎస్ రత్నం జై తెలంగాణ నినాదం చేయడం చంద్రబాబు అనుమతితోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహానాడులో తీర్మానం కోసం పట్టుపడుతున్న టిఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలతో పాటు ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి సరైన సమాధానం ఇవ్వడానికే వేదికపై జై తెలంగాణ నినాదం చేసినట్టుగా భావిస్తున్నారు. పార్టీ వేదికపైనే జై తెలంగాణ నినాదం చేశామని చెప్పడం ద్వారా తమ పార్టీ, పార్టీ అధినేత తెలంగాణకు కట్టుబడే ఉన్నారన్న సంకేతాలు ఇటు ప్రజలకు కూడా ఇచ్చినట్టవుతుందని టిడిపి భావించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కెసిఆర్‌ను వదిలి రావాలని కూడా ఆయన తెలంగాణవాదులకు సూచించారు.