వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను చంపేందుకు కేంద్రం కుట్ర, దీక్ష కొనసాగుతుంది: బాబా రామ్‌దేవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
లక్నో: కేంద్ర ప్రభుత్వం తనను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నాలు చేయడమో మరెక్కడికో పంపించడానికి ప్రయత్నాలు చేసిందని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా ఆదివారం హరిద్వార్‌లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. సత్యాగ్రహం పేరుతో తాను రాజకీయం చేస్తున్నానని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదన్నారు. విదేశాలలోని నల్లడబ్బు వెనక్కి తెప్పించాలనే ప్రధాన డిమాండుతో న్యూఢిల్లీలోని రాంలీలా మైదనంలో ఆయన చేపట్టిన దీక్షను కేంద్రం భగ్నం చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఆయనను అరెస్టు చేసి హరిద్వార్ తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ కేంద్రం మోస పూరిత చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు. తాను దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. మహిళలను ఈడ్చి వేయడం, పిల్లలను కొట్టడం చేశారన్నారు. రాత్రి జరిగిన సంఘటన తనను షాక్‌కు గురి చంసిందన్నారు.

శిబిరాన్ని ఖాళీ చేయమని తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఆర్ధరాత్రి దొంగల్లా వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై దాడి చేయడం అమానుషం అన్నారు. తన దీక్షను విరమింప జేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిళ్లకు పాల్పడిందని విమర్శించారు. కేంద్రం తరఫువ చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. తన దీక్షకు వస్తున్న ఆదరణ చూసి కేంద్రం ఈ దమనచర్యకు పాల్పడిందన్నారు. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తుందని మండిపడ్డారు. తనకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కారు.

English summary
"They wanted to kidnap me and kill me or send me somewhere," a soar throated and at times teary eyed Baba Ramdev said at a press conference in Hardwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X