వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యోగాలో తప్ప నైపుణ్యం లేదు: రామ్‌దేవ్‌పై అన్నాహజారే విమర్శలు

కాగా డెహ్రాడూన్ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాబా రామ్‌దేవ్‌ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కలిశారు. ప్రభుత్వం బాబా దీక్ష విరమింప జేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బాబా నిరాహారదీక్ష విరమించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ నాగపూర్‌లో విజ్ఞప్తి చేశారు. దేశానికి రామ్‌దేవ్ సేవలు ఎంతో అవసరమని, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష మానుకోవాలని ఆయన కోరారు. అవినీతిపై రామ్‌దేవ్ చేస్తున్న పోరాటాన్ని యావత్ జాతి గుర్తించిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీక్ష విరమించి జాతిని జాగృతం చేసే ఉద్యమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రామ్‌దేవ్ అరెస్ట్, ఆస్పత్రి పాలవడం పట్ల ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారని భాగవత్ తెలిపారు.