నాగం, ఎర్రబెల్లి టీవీ ఫైట్: నిన్ను తంతారంటే, నిన్ను తంతారని తిట్లు

Errabelli Dayakar Rao-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డికి మధ్య ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ పెట్టిన చర్చా కార్యక్రమం హద్దులు దాటి దూషణల స్థాయికి చేరుకుంది. ఇరువురు నాయకులు తీవ్ర పదజాలంతో పరస్పరం తిట్టుకున్నారు. అర్థవంతమైన చర్చలు జరపడంలో వారు విఫలమయ్యారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వద్ద డబ్బులు తీసుకుని తెలంగాణ నగారా సభలను పెట్టినట్లు రుజువులు చూపాలని నాగం జనార్దన్ రెడ్డి చేసిస డిమాండుకు ఎర్రబెల్లి దయాకర్ రావు సరైన సమాధానం చెప్పలేకపోయారు. నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు సీమాంధ్రకు చెందిన జీఎంఆర్ కంపెనీ కాంట్రాక్టులు చేస్తున్నాడని దయాకర్ రావు ఆరోపించారు. న్యాయబద్దంగా కాంట్రాక్టు చేసి తన కుమారుడు డబ్బులు తీసుకుంటున్నాడని, తెలంగాణలోనే కాంట్రాక్టు చేస్తున్నాడని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.

తాను ఇల్లు కొనుక్కున్న మాట వాస్తవమేనని, దానికి సంబంధించిన అప్పు వాయిదాలు చెలిస్తున్నానని నాగం చెప్పారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ విషయాలు నాగం చెప్పినా వినకుండా దయాకర్ రావు అవే ఆరోపణలు చేస్తూ వచ్చారు. మధ్యలో చర్చలోకి వచ్చిన వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి తాను నాగం జనార్దన్ రెడ్డితో చర్చలు జరపలేదని, తాము ఎదురు పడినా మాట్లాడుకున్న సందర్భాలు లేవని చెప్పారు. దయాకర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో దయాకర్ రావు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ప్రజలు నిన్ను తంతారంటే నిన్ను తంతారని నాగం, ఎర్రబెల్లి తిట్టుకున్నారు. దయాకర్ రావుకు మెంటల్ అని నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెంచాలని, చంద్రబాబు తెలంగాణ నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు కట్టుబడి ఉంటారా, లేదా చెప్పాలని ఆయన అడిగారు. సీమాంధ్ర నాయకులతో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. వరంగల్‌లో సభ పెట్టి ఎవరేమిటో తేల్చుకుందామని నాగం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+