మేం సిద్ధం, మీరు సిద్ధంగా ఉండండి: ఎర్రబెల్లికి హరీష్ రావు కౌంటర్

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వరంగల్‌లో తలపెట్టిన సాగుపోరును అడ్డుకున్నది టిఆర్ఎస్సే అన్నారు. అలాంటిది టిఆర్ఎస్‌పై ఎర్రబెల్లి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఆయనకు మతిభ్రమించి అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గూర్ఖాలాండ్ తరహా ప్యాకేజీని తెలంగాణకు ఆమోదించేది లేదని ఆయన అన్నారు. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెసు నేతలు తెలంగాణపై అధిష్టానం స్పష్టత లేకుండా తిరిగి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా రాకపోతే కాంగ్రెసు నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications