ఇండియాలోని ఫేస్‌బుక్‌లో ఆఫీసులో త్వరలో రిక్రూట్‌మెంట్

ఫేస్‌బుక్ హైదరాబాద్ ఆఫీస్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఫేస్‌బుక్ యూజర్స్, అడ్వర్టైజర్స్‌లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనితోపాటు ఇప్పటివరకు ఫేస్‌బుక్ హైదరాబాద్ ఆఫీసులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 100పైగా ఉండగా త్వరలో సేల్స్ ఆపరేటన్స్ స్టాఫ్, యూజర్ ఆపరేషన్స్ టీమ్, ఫైనాన్సియల్ రిక్యూర్మెంట్ టీమ్‌ని త్వరలో రిక్రూట్ చేయనున్నట్లు తెలిపారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 600మిలియన్ యూజర్స్‌ని కలిగి ఉందన్నారు.
ఇండియా ఫేస్‌బుక్ అభివృద్ది రేటులో పయనిస్తుందని తెలిపారు. ఇండియాలో ఫేస్‌బుక్ ప్రారంభించినప్పుడు 17మిలియన్ జనాభా ఫేస్‌బుక్‌కి కనెక్ట్ కాగా ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికే ఆ సంఖ్య 25మిలియన్ జనాభాకు చేరిందన్నారు. ప్రస్తుతానికి ఫేస్‌బుక్ ఏడు ప్రాంతీయ భాషల(తెలుగు, హింది, పంజాబి, తమిళం, బెంగాళీ, మళయాళం, నేపాలి)లో తన సేవలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications