హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూసుకుందాం రా: మంత్రులకు నాయిని సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayini Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుపై మంగళవారం ధ్వజమెత్తిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌పై టిఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వారిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్షన్ చేస్తుంటే మంత్రులు యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. దానం, ముఖేష్ ప్రజలు వేసిన ఓట్ల ద్వారా గెలిచి వారికే అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రజలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముఖేష్ గౌడ్ ఎల్ అండ్ టికి వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు.

మెట్రో వల్ల చారిత్రక సంపద నాశనం అవుతుందని అన్నారు. తాము మెట్రోను వ్యతిరేకించడం లేదని కేవలం అలైన్మెంట్ మాత్రమే మార్చమని సూచిస్తున్నామని అన్నారు. బెంగుళూరు తదితర ప్రధాన నగరాలలో కూడా అండర్ గ్రౌండ్ మెట్రో రైలు వేస్తున్నారని గుర్తు చేశారు. నగర మంత్రులై ఉండి హైదరాబాదుపై నిర్లక్ష్యం వహిస్తున్న దానం, ముఖేష్‌లకు కెసిఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోని ముఖేష్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని అప్పుడు వారు విజయవాడలో ఉంటారో హైదరాబాదులో ఉంటారో నిర్ణయించుకోవాలని అన్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తమపై ఎదురు దాడి చేస్తే తాము మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. మాకు గ్రేటర్ హైదరాబాద్ రుచి చూపిస్తామని హెచ్చరిస్తే భయపడమన్నారు. మంత్రులు తాము తెలంగాణలో ఉన్నారనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలన్నారు. మెట్రో కారణంగా భూమి కోల్పోయిన వారికి మార్కెట్ రేటు కూడా ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదుకు రావాల్సిన నీటిని పోతిరెడ్డిపాడు గుండా సీమకు నీరు తీసుకు వెళితే నగర మంత్రులు మాట్లాడ లేదన్నారు.

English summary
Nayini Narasimha Reddy blamed CM Kiran Kumar Reddy, minister Danam Nagender and Mukesh Goud today. He warned them to support voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X