తెలంగాణ నేతల బుజ్జగింపునకు హై కమాండ్ మిషన్

కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే కార్యక్రమాలను ఖరారు చేసేందుకు జరుగుతున్న సమావేశాలకు హాజరు సంఖ్య తగ్గుతూ వస్తోంది. తమను విభజించి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై, సుబ్బిరామిరెడ్డిపై, రేణుకా చౌదరిపై తెలంగాణ కాంగ్రెసు నేతలు విమర్శలు చేశారు. దాదాపు 42 ప్రజాప్రతినిధులు రాజీనామా చేయగా సోమవారం జరిగిన సమావేశానికి ముగ్గురు 9 మంది శానససభ్యులు (వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు), 9 మంది ఎమ్మెల్సీలు, 7 గురు పార్లమెంటు సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణకు చెందిన 11 మంది మంత్రులు రాజీనామా చేయగా, 8 మందిని వెనక్కి రప్పించడంలో ముఖ్యమంత్రి ఫలితం సాధించారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెప్పి ఎస్సీ శానససభ్యులను భయపెట్టినట్లు చెబుతున్నారు. టి. సుబ్బిరామిరెడ్డి నలుగురు తెలంగాణ పార్లమెంటు సభ్యులను సంప్రదించినట్లు సమాచారం. రేణుకా చౌదరి కూడా తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులను బుజ్జగించడంలో మునిగిపోయినట్లు సమాచారం.