తెలంగాణ సమస్యను త్వరగా తేల్చండి: చిరంజీవి

కొనసాగుతున్న అమాయకుల ఆత్మహత్యలు, చెదురుమదురు హింసాత్మక సంఘటనలు, భౌతిక దాడులు, బంద్‌ల పట్ల సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని, ఒకరినొకరు దూషించుకోవడం, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు - సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. లక్ష్యాలు ఎంత పవి త్రమో వాటిని సాధించే మార్గాలూ అంతే పవిత్రంగా ఉండాలన్న గాంధీ మాటల్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా నష్టపోయామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications