వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామూహిక స్వలింగ సంపర్కుల వివాహం!

|
Google Oneindia TeluguNews

Gay
వారి నిరీక్షణ ఫలించింది.. స్వలింగ సంపర్కుల వివాహా బంధాన్ని చట్టబద్దం చేస్తూ ఉత్తర్వులు జారీ కావటంతో వారి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇంకేముంది అవాంతరాలు తొలిగిపోయాయి.. స్వేచ్ఛగా ఒక్కటయ్యే హక్కు వారికి లభించింది. ఈ సందర్భంగా ఆదివారం మానహట్టన్, నైయాగరా ఫాల్స్ ప్రాంతాల్లో 100ల సంఖ్యలో స్వలింగ సంపర్కులు తమ వివాహా వేడుకలను అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు న్యూయార్క్ ప్రాంతం నుంచే కాకుండా న్యూ జెర్సీ వంటి తదితర ప్రాంతాల నుంచి జంటలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

హవాలీ ప్రాంతానికి చెందిన యువ విద్యార్థులు కోడీ నాగానుమా, స్యూ యుయాన్ జీ ఈ సందర్భంగా ఒక్కటయ్యారు.. సంవత్సరం నుంచి డేటింగ్ చేసుకుంటున్న వీరు ఒకరి పై ఒకరికి ఉన్న ఇష్టతను మనసు విప్పి వెల్లడించారు. న్యాయమూర్తుల సమక్షానా.. రోజంతా సంప్రాదాయబద్ధంగా జరిగిన వివాహాలకు బంధుమిత్రులు సపరివారసమేతంగా హాజరయ్యారు. దింతో కనెక్టీకట్, మాసాచుసెట్స్, వెర్మాంట్, న్యూ హాంషైర్, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 5 వివాహా కేంద్రాలు జనసమర్థంతో కిట కిటలాడాయి.

చట్టబద్ధంగా ఒక్కటైన స్వలింగ సంపర్క జంటలకు సాధారణ పెళ్లిళ్లకు వర్తించే హక్కులన్ని లభిస్తాయి. చాలా కాలం పోరాటం తరువాత జూన్ 24 తేదిన స్వలింగ్ వివాహాలను చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా న్యూ యార్క్ సిటీ మేయర్ మైకేల్ మాట్లాడుతూ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించే న్యూ యార్క్ ప్రాంతం ప్రజల స్వేచ్ఛా హక్కులను గౌరవించటంతో పాటు దేశ ఐక్యతకు కృషి చేస్తుందన్నారు.
స్వలింగ సంపర్క వివాహాబంధాన్ని గౌరవిస్తూ ఈ చట్టాన్ని ఫెడరల్ వ్యవస్థలో చోటు కల్పిస్తున్నట్లు ఆమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా తొలిగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

English summary
From Manhattan to Niagara Falls, hundreds of gay couples got married across New York on Sunday, one month after it was legalised in the state. Besides couples from New York, partners from other states also came to New York to get married, particularly from neighbouring New Jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X