వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా దీక్షకు నో పర్మిషన్, ఎమర్జెన్సీ వంటి స్థితి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: ఢిల్లీలో సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అన్నా హజారే దీక్షను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో అత్యవసర పరిస్థితి వంటి వాతావరణం నెలకొని ఉంది. జయప్రకాష్ నారాయణ్ మెమోరియల్ పార్కులో అన్నా హజారే దీక్షకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు 22 షరతులు పెట్టారు. వాటిలో 16 షరతులను అంగీకరించడానికి అన్నా హజారే అంగీకరించారు. మొత్తం 22 షరతులను అంగీకరించనందున దీక్షకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు.

పార్కు పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పార్కులోకి ఎవరినీ అనుమతించబోమని, పార్కులోకి బలవంతంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అన్నా హజారేను అరెస్టు చేస్తామని వారు చెప్పారు. మూడు రోజులు మాత్రమే దీక్ష చేయాలనే పోలీసుల షరతును అన్నా అంగీకరించలేదు. అలాగే, వేదిక వద్ద ప్రజల హాజరు, ఎప్పటికప్పుడు అన్నా ఆరోగ్యంపై వైద్యుల పరీక్షలు వంటి షరతులకు కూడా అన్నా టీమ్ అంగీకరించలేదు. అయితే, తనను అరెస్టు చేసినా దీక్ష సాగుతుందని అన్నా హజరే చెప్పారు.

English summary
The Delhi Police on Monday rejected an undertaking submitted by Team Anna to sit on fast tomorrow at Jai Prakash Narain Memorial Park in central Delhi, against the government’s draft Lokpal Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X