'అనా హజారే అవినీతిపడుడు', కాంగ్రెసు ఎదురుదాడి

ముగ్గురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధికార ప్రతిని«ధి అన్నాపై ఆరోపణల వర్షం కురిపించారు. ఎదురుదాడితో ధ్వజమెత్తారు. ట్రస్టుల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్నా బృందంలో నియంతలున్నారని అన్నారు. అన్నా దీక్షను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆత్మహత్యతో పోల్చారు. వారి ఆరోపణలకు అన్నా, ఆయన బృందం దీటుగా స్పందించింది. తప్పు చేస్తే తనను జైల్లో పెట్టాలని అన్నా సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఆరోపణలు ఆ పార్టీ ఆందోళనను సూచిస్తున్నాయని ఆయన బృందం ఎద్దేవా చేసింది. అరెస్ట్ చేస్తే జైల్లోనే దీక్షలు కొనసాగిస్తామని ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications