జగన్ కోసం జీసస్, ప్రార్థనలకు బల్క్ ఎస్ఎంఎస్‌లు

YS Jagan
హైదరాబాద్: జగన్ కోసం జీసస్ అనే మంత్రజపాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. "క్రీస్తు సోదరులారా! జగన్ కోసం ప్రార్థనలు చేయండి. దుష్టశక్తుల నుంచి వైఎస్ కు టుంబాన్ని కాపాడండి'' అంటూ లక్షల సంఖ్యలో బల్క్ ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయని ఆ పత్రిక రాసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై హైకోర్టుకు పూర్తి స్థాయి సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఎస్ఎంఎస్‌లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

జగన్‌ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కాపాడాలని కూడా ఆ మెసేజ్‌లలో కోరారు. దీనికి అ నుగుణంగా రాయలసీమలోని కొన్ని చర్చిలలో ఆదివారం జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగాయి. "యువనేతగా ఉన్నటువంటి జగన్మోహన్‌రెడ్డి మీద బనాయించినటువంటి అక్రమ కేసులను నీ సన్నిధినే నినదించుచున్నాము. న్యాయము చివరికి విజయము సాధించునని మీ ఉల్లేఖనముల ద్వారా తెలియపరచియున్నారు. మా తండ్రీ, అనేకులైన ప్రేమకు, జనాదరణకు పాత్రుడైనటువంటి జగన్‌పై మోపబడునటువంటి అక్రమ కేసులన్నింటినీ...'' అంటూ ఒక ఫాదర్ ప్రార్థనలు జరిపారని ఆ పత్రిక రాసింది.

ఈ ఎస్మెమ్మెస్‌ల ద్వారా సానుభూతి సాధించడంతోపాటు, 'నేను మీ వాడిని' అని ఆ వర్గం మొత్తాన్ని తనవైపు తిప్పుకొనే ఎత్తుగడగా చెబుతున్నారని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియలో జగన్ బావ, మత ప్రభోదకుడు బ్రదర్ అనిల్ కుమార్ చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోందని రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+