సోనియా రాజకీయ సలహాదారుపై వైయస్ జగన్ అటాక్

తాను ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను ఏ ఒక్క ఐఎఎస్ అధికారికి కూడా ఫోన్ చేయలేదని, అలా చేశానేమో అధికారులను చెప్పమనండి అని ఆయన అన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను కడప జిల్లాకు, సాక్షి మీడియాకు మాత్రమే పరిమితమయ్యానని ఆయన చెప్పారు. తన పిల్లలు బెంగుళూర్‌లో చదువుతున్నారని ఆయన చెప్పారు. తాను ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నానని ఎలా చెప్పగలుగుతారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications